AP: వైఎస్ జగన్ వ్యాఖ్యలకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. చెల్లిపై ప్రేమతో జగన్ షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని ఆమె స్పష్టం చేశారు. 'సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు. 2016లో ఈడీ అటాచ్ చేసినందున షేర్ల బదిలీ చేయకూడదని జగన్ వాదిస్తున్నారు. షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని అంటున్నారు. మరీ 2019లో వంద శాతం షేర్లు బదలాయిస్తామని ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?' అని షర్మిల ప్రశ్నించారు.