చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతాడని అంతా నమ్మారు.’ అని ఎన్నికల హామీలను ఉద్దేశించి జగన్ అన్నారు. ఇప్పుడు పలావు లేదు.. బిర్యానీ లేదన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా, నాయకులైనా అంతేనని అన్నారు. తాను అభ్యర్థిగా ప్రకటించిన బొత్స సత్యనారాయణకు మీరంతా అండగా నిలవాలని జగన్ ప్రజలను కోరారు.