AP: తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని మాజీ సీఎం జగన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని, ఆయన మోసాన్ని గుర్తించిందన్నారు. అందుకే తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ చంద్రబాబుకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. కోట్ల మంది హిందువుల మనోభావాల విషయంలో చంద్రబాబు అబద్ధాలు ఆడారాని పేర్కొన్నారు.