జగన్‌వి శవ రాజకీయాలు: పల్లా

63చూసినవారు
జగన్‌వి శవ రాజకీయాలు: పల్లా
గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదిస్తూ ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత హత్యలను టీడీపీపై రుద్దడం ఆయనకే చెల్లుబాటు అవుతుందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వైసీపీ నేత రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్