AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఉన్న ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను ఇప్పుడు పూర్తిగా రద్దు చేసి, నేరుగా జిల్లా అధ్యక్షులనే పార్టీ బాధ్యులుగా చేస్తున్నారు. ఇవి కొలిక్కి రాగానే జనవరి ఆఖరులో లేదా మార్చి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలయ్యాక కేసుల బారిన పడిన వైసీపీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులను కలిసి మాట్లాడనున్నారు.