1901, అక్టోబర్ 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి అనే ఏజెన్సీ గ్రామంలో గిరిజన గోండు తెగకు చెందిన దంపతులకు కుమ్రం భీం జన్మించాడు. భీం తల్లిదండ్రులు కొమురం చిన్నూ, సోంబారు. నైజాం అసఫ్ ఝాహీల పాలనలో దౌర్జన్యాలను ఎన్నో చూస్తూ పెరిగాడు కుమ్రం. అదే సమయంలో మన్యం వీరులు రాంజీ గోండ్, ఇతర మన్యం వీరుల పోరాట గాథలు తన తాతల ద్వారా తెలుసుకుంటూ భీం స్ఫూర్తి పొందేవాడు. అతడికి 15 ఏళ్లు ఉన్నప్పుడు ఫారెస్ట్ శాఖ అధికారులు జరిపిన దాడిలో తండ్రి మరణించాడు.