చింతకొమ్మదిన్నె: ఆర్టీసీ బస్సు పాల వ్యాన్ ఢీ
చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని రాయచోటి-కడప రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గువ్వల చెరువు ఘాట్ రోడ్డు సమీపంలో బిడికి వద్ద ఆర్టీసీ బస్సు, పాల వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి. బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పాల వాహనం డ్రైవర్ కి చిన్నపాటి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ ను చికిత్స నిమిత్తం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.