మండల కేంద్రమైన కొండాపురంలోని సచివాలయం 2 పరిధిలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులను గుర్తించి
పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. గర్భిణులకు, బాలింతలకు,
పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సలహాలు వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్ ఓ శ్రావణి, సూపర్ వైజర్ మేరీ, విజయకుమార్, రాజకుమార్, రాజేష్ పాల్గొన్నారు.