నందలూరు ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు
రాయల్ సేవా సమితి, స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు గంగనపల్లి శ్రీనివాసులు, మిత్రబృందం ఆధ్వర్యంలో నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహార వితరణ శనివారం నిర్వహించారు. ఓపి పుస్తకాలను డాక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్, విశ్వనాథ్ ఆసుపత్రి సిబ్బంది, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య రాయల్ టీం సభ్యులు పెంచలయ్య, పాల్గొన్నారు.