నందలూరులో రెండు రోజులపాటు అత్యంత వైభవంగా ఉరుసు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ తెలిపారు. గురువారం రాజంపేటలో ఆయన మాట్లాడుతూ పదవ తేదీన గంధం, 11వ తేదీన ఉరుసు ఉంటుందన్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు ను ఉరుసు మహోత్సవానికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.