Oct 21, 2024, 03:10 IST/
కేబినెట్ విస్తరణపై తర్జన భర్జన!
Oct 21, 2024, 03:10 IST
మంత్రి వర్గ విస్తరణపై ఒత్తిడి చేయొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ సూచించినట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ అంశాన్ని తమ వద్ద ప్రస్తావించొద్దని రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేతకు ఏఐసీసీ చీఫ్ చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ ఎవరికి వారు తమదైన శైలీలో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి కేబినెట్ విస్తరణ బ్రేక్‌కు క్యాస్ట్ ఈక్వేషన్సే ప్రధాన కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే సుదీర్ఘంగా కసరత్తు చేసిన పీసీసీ, ఏఐసీసీ కొన్ని పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం.