Mar 18, 2025, 16:03 IST/మహబూబాబాద్
మహబూబాబాద్
నెల్లికుదురు: చెరువు కట్ట మరమ్మతులు చేపట్టాలని రైతుల ఆందోళన
Mar 18, 2025, 16:03 IST
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో తెగిన చెరువు కట్ట వద్ద కట్టకు మరమ్మతులు చేపించాలంటూ మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. గత వర్షాకాలంలో వరదలకు చెరువు కట్ట తెగిన ఇప్పటివరకు దాన్ని పట్టించుకునే నాధుడు లేదంటూ కట్ట వద్ద నిలుచొని నిరసన తెలిపారు. తక్షణమే అధికారుల స్పందించి తెగిన చెరువు కట్టకు మరమ్మతూ చేపియాలని డిమాండ్ చేశారు. కెనాల్ నీళ్లు వచ్చిన కట్ట తెగి ఉండడంతో చుక్క నీరు లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.