నందలూరులో మండల స్థాయి సిబ్బందికి నైపుణ్య గణన- 2024 శిక్షణా కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సభా భవనంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సుజాతమ్మ మాట్లాడుతూ నైపుణ్య గణన సర్వే నందు 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారి నుండి సమగ్ర డేటాను సేకరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి పెంచలయ్య సిబ్బందికి సూచనలు అందజేశారు.