అభివృద్ధి పనులకు భూమి పూజ
రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అభివృద్ధి పనులకు గురువారం టిటిడి అధికారులు భూమి పూజ నిర్వహించారు. గర్భగుడిలో మరమ్మత్తులు చేపడుతున్నట్లు వారు తెలిపారు. సెప్టెంబర్ నెల నుండి రెండు నెలలపాటు గర్భగుడిని మూసివేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.