డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో బుధవారం రాత్రి కొండ చిలువ హల్చల్ చేసింది. గ్రామానికి చెందిన వెంకట రమణ అనే వ్యక్తి ఇంట్లో వచ్చింది. ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఇంటి పక్క వారు వచ్చి ఆ కొండ చిలువను చంపేశారు. ఆ కొండ చిలువ 8అడుగుల పొడవు ఉంటుందని, గ్రామంలో ఇతర ఇంట్లో 10కోళ్ళను, 2 కుక్క పిల్లలను తిన్నదని గ్రామ ప్రజలు చెప్పారు.