ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గంగపేరూరు చిన్న చెరువు వద్ద 20 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని టిడిపి నాయకులు జిల్లా కలెక్టర్ శివశంకర్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్పందించిన ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు ఆక్రమణ భూమిని పరిశీలించారు. విచారించి నివేదిక పై అధికారులకు అందజేస్తామని తెలిపారు.