రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శనివారం టిటిడి అధికారులు ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులకు స్వపన తిరుమంజన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు స్వామి వారికి పట్టు వస్త్రాలు, గజమాలలు సమర్పించారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి దర్శనార్థం భక్తులను అనువదింపజేశారు.