పెండ్లిమర్రి: శివపార్వతులను పల్లకిలో ఊరేగింపు
పెండ్లిమర్రి మండలం గంగనపల్లి పంచాయతీలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాసం వారోత్సవాల సందర్బంగా సోమవారం వేద పండితులు శివపార్వతులకు అభిషేకాలు నిర్వహించారు. శివపార్వతులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవస్థానం తరుపున భక్తులకు ఉచిత అన్న ప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేసారు.