పోరుమామిళ్ల: మద్యం అమ్మితే పాల్పడితే కఠిన చర్యలు
మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి హెచ్చరించారు. గతంలో మద్యం అమ్ముతూ పట్టుబడిన పలువురిని పోలీస్ స్టేషను బుధవారం పిలిపించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ. మరోసారి మద్యం అక్రమాలు చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వీరిని ముందస్తు జాగ్రత్తగా తహశీల్దార్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేశామని తెలిపారు.