వాయిదాల్లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి

54చూసినవారు
వాయిదాల్లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి
ఒక అధికారి వాయిదాల్లో లంచాన్ని తీసుకుంటూ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు దొరికిపోయాడు. యూపీలోని బరేలీలో ఆరిష్‌ అనే వ్యక్తి మదర్సాను తరలించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేయగా వక్ఫ్‌ సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఆసిఫ్ లంచం డిమాండ్‌ చేశాడు. కాగా, ఒకేసారి అంత డబ్బు ఇవ్వలేనని ఆరిష్‌ తెలపగా.. వాయిదాల్లో లంచాన్ని చెల్లించాలని ఆసిఫ్ చెప్పాడు. మంగళవారం తొలి వాయిదా లంచం తీసుకుంటుండగా అధికారులు ఆసిఫ్ ను అరెస్ట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్