వరంగల్, హన్మకొండ జిల్లాల్లో జరిగిన పలు వేడుకల్లో బుధవారం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. దేశాయిపేట, హంటర్ రోడ్ తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ, గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, ఆహ్వానితులతో సరదాగా గడిపారు. మంత్రితో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అపురూప క్షణాలను కెమెరాల్లో బంధించారు. తమ సొంతింటి ఆడబిడ్డగా భావించి పట్టుబట్టలతో మంత్రి సురేఖను సత్కరించారు.