TG: హోటల్‌లో కుళ్లిన చికెన్ ఉపయోగించడంతో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం లక్డికాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్, సెన్సేషన్ సినిమా థియేటర్ వద్ద జీహెచ్ఎంసీ మేయర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలుషిత ఆహారం గుర్తించటంతో హోటల్ సిబ్బందిపై మండిపడ్డారు. అలాగే బంజారాహిల్స్ డైన్ హిల్ మండి రెస్టారెంట్‌లో కూడా పాడైన మాంసాన్ని ఫ్రిజ్‌లో గుర్తించిన మేయర్ వాటి శాంపిల్స్ తీసుకోమని అధికారులను ఆదేశించారు.