పోరుమామిళ్లలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్టు

55చూసినవారు
పోరుమామిళ్లలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్టు
పోరుమామిళ్లలో అక్రమంగా తరలిస్తున్న రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు, ఎస్సై కొండారెడ్డి తెలిపారు. పోలేరమ్మ ఆలయం సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సోమవారం సాయంత్రం సమాచారం రావడంతో దాడి చేశామని తెలిపారు. ముగ్గురు వ్యక్తులతో పాటు, రెండు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని వారి వద్ద నుంచి రూ. 1000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిని అరెస్టు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్