రాజకీయ బదిలీలు, అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహించలేదని కూటమి ప్రభుత్వం నాలుగు నెలలకే ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేశారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజమెత్తారు. గురువారం ప్రొద్దుటూరు ఆయన మాట్లాడుతూ.. ఖాకీ చొక్కా మాట విని, ఖద్దరు మాట వినలేదని అందుకే ఆయనకు చంద్రబాబు ఈ బహుమానం ఇచ్చాడని ఆరోపించారు. ఈ బదిలీ మీకు అవమానం కాదు, కడపజిల్లా ప్రజల పక్షాన మీకు మేము సెల్యూట్ చేస్తున్నాము అని పేర్కొన్నారు.