పులివెందుల: కంది పంటలో సస్యరక్షణతో అధిక దిగుబడులు
కంది పంటలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాఖ ఏడీ ప్రభాకర్ రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం సాయంత్రం పులివెందుల మండలం పోలేపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కంది పంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ఆయన శనగ విత్తనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్య క్రమంలో ఏవోలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.