వేంపల్లె పట్టణంలోనీ కడప రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ మెమోరియల్ పార్కులో ఆదివారం సందర్శకులతో ఆదివారం సందడి నెలకొంది. దసరా శెలవులు ముగియడం, ఆదివారం సెలవు దినం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో పార్కును సందర్శించారు. అక్కడ ఉన్న ఆట వస్తువులతో ఆహ్లాదకరంగా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపారు. పార్కులోని వైఎస్ఆర్ విగ్రహాం వద్ద ఫోటోలు దిగి, తమ ఆనందాన్ని వ్యక్త పరుచుకున్నారు. పార్కు ప్రవేశానికి వేంపల్లె గ్రామ పంచాయతీ అధికారులు చిన్న పిల్లలకు రూ. 5, పెద్దలకు రూ. 10 లు టికెట్ ధర నిర్ణయించారు.