మార్చ్ 31 వరకు రిమ్స్‌లో అత్యవసర సేవలు

843చూసినవారు
మార్చ్ 31 వరకు రిమ్స్‌లో అత్యవసర సేవలు
కరోనా వైరస్ కారణంగా రిమ్స్‌లో సాధారణ శస్త్రచికిత్సలు నిలిచిపోనున్నాయి. ఈ నెల 31 వరకు అత్యవసర సేవలు మినహాయించి సాధారణ వైద్యసేవలను నిలిపి వేయాలంటూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ కె.వెంకటేశ్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

దీంతో కడప రిమ్స్‌తో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో సాధారణ వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కరోనా వ్యాప్తిపై ప్రపంచాన్ని హెచ్చరించి, కట్టడి చేయాలని సూచించింది.

అందులో భాగంగా ఆసుపత్రులపై వత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన జారీ చేసిన సర్క్యులర్‌ ఎల్‌ఆర్‌ నెం.డీఎంఈ/2020లో పేర్కొన్నారు. సాధారణ శస్త్రచికిత్సలకు వచ్చే రోగులకు ఈ విషయాన్ని చెప్పి వారికి నచ్చచెప్పాలని సూచించింది.

సంబంధిత పోస్ట్