ఐక్యతను దెబ్బతీసే వారి కుట్రలు సాగనివ్వం: మోడీ

80చూసినవారు
ఐక్యతను దెబ్బతీసే వారి కుట్రలు సాగనివ్వం: మోడీ
దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్‌ 370ని తొలగించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా విగ్రహం వద్ద ఆయన నివాళి అర్పించి మాట్లాడారు. 'ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నాం. స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వారి కుట్రలు సాగనివ్వం. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దేశ వికాసానికి దోహదం చేస్తుంది' అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్