ఓబులవారిపల్లె మండలం వై. కోట పంచాయతీ లోని రాములమ్మ ఎస్టీ కాలనీలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శుక్రవారం ఓబులవారి పల్లి మండలం సిపిఐ కార్యదర్శి నాగమ్మ అన్నారు. బోర్ లో నీటిమట్టం తగ్గిపోవడంతో పది రోజుల నుండి నీరు రాలేదని అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆమె తెలిపారు. వీధిలైట్లు వెలగకపోవడంతో పాముల బెడద ఎక్కువైందని ఆమె తెలియజేశారు. సర్పంచ్ కు చెప్పినా పట్టించుకోలేదన్నారు.