కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ అన్నారు. రైల్వే కోడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో తీరని సమస్యలతో ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారని ఆయన తెలిపారు.