ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా పనిచేసి ఏపీయూడబ్ల్యూజే సంఘానికి మంచి పేరుతీసుకురా రావాలని రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం సుండుపల్లె మండల కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే సుండుపల్లి మండల అధ్యక్షుడిగా ఆంధ్రజ్యోతి విలేఖరి తిరుపాల్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు రామసుబ్బారెడ్డి తెలిపారు. విలువలతో కూడిన వార్తలు రాసి ప్రజాదరణ పొందాలని కోరారు.