ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నామినేషన్ దాఖలు చేసి, పోటీ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీ. రామచంద్రయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కడపకు విచ్చేసిన సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు, చిట్వేలి మండల లీగల్ సెల్ అధ్యక్షులు నాయుని బాలాజీ వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పగడాల వెంకటేష్, మాదినేని రాజా పాల్గొన్నారు.