Oct 16, 2024, 02:10 IST/
ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత ఐవీఎఫ్ సేవలు!
Oct 16, 2024, 02:10 IST
ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత IVF సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన మెడిసిన్, పరికరాలను కొనుగోలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మాత్రమే ఐవీఎఫ్ సేవలు ఉండగా.. ఇకపై జిల్లాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.