తన భర్త మరణానికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఖిల పడమర కోటకు చెందిన సంధ్యారాణి అంబే ద్కర్ విగ్రహం ఎదుట మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపింది. ఈ నెల 10న రాత్రి తన భర్త ఎండీ హుస్సేన్ పడమర కోటకు చెందిన మేస్త్రీ గూడూరు శివ వద్దకు వెళ్లాడు. హుస్సేన్ అపస్మారక స్థితిలో ఉన్నాడని శివ ఫోన్ చేసి చెప్పాడు. అక్కడి వెళ్లేసరికి అతడి నోటిలో నుంచి రక్తం కారుతు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.