రాయచోటి కౌన్సిలర్ ఆసీఫ్ అలీఖాన్ గుండెపోటుతో మృతి..
రాయచోటి మున్సిపల్ పరిధిలో సీనియర్ పార్టీ నాయకుడు, వార్డు కౌన్సిలర్ ఆసీఫ్ అలీ ఖాన్(మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం మరిది, దివంగత మైనార్టీ నేత అఫ్జల్ అలీఖాన్ సోదరుడు) మృతితో ఆత్మీయుడిని కోల్పోయానని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం మధ్యాహ్నం 12. 30 గంటలకు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే హుటా హుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు.