రాయచోటి కలెక్టర్ కార్యాలయం నందు శుక్రవారం గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ డిఆర్ఓ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా గిరిజనుల హక్కుల కోసం పోరాడాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలెం కోట రత్నమ్మ, పలు గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.