రాయచోటిలోని హోటళ్ళలో అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పి కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం రాయచోటిలోని హోటళ్ళు, లాడ్జీల యజమానులతో సమావేశం నిర్వహించారు. మద్యం తాగించడం, పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాడ్జీలకు వచ్చే సందర్శకుల నుండి ఆధార్ కార్డు తీసుకుని వారంలో ఒకసారి పోలీసు స్టేషన్లో అందజేయాలన్నారు.