నాలుగో రోజు కూడా పోలీసుల విచారణకు హాజరుకాని కాకాణి

64చూసినవారు
నాలుగో రోజు కూడా పోలీసుల విచారణకు హాజరుకాని కాకాణి
AP: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. నాలుగో రోజు కూడా కాకాణి పోలీసుల విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు నెల్లూరు పోలీసులు మూడోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు మాజీ మంత్రి కాకాణి కోసం హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాకాణి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా హైకోర్టు.. అరెస్టు కాకుండా ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

ట్యాగ్స్ :