సరుకు రవాణా రంగంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడిచిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 144.140 మిలియన్ టన్నుల అత్యుత్తమ సరుకు రవాణాను సాధించి రూ.13,825 కోట్ల ఆదాయం ఆర్జించింది. రైల్వే సిబ్బంది అసాధారణ, సమిష్టి కృషి, అన్ని విభాగాల కృషి ఫలితంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించినట్లు జైన్ పేర్కొన్నారు.