ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీని ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. ఆటిస్టిక్ పిల్లలు సాధారణ పిల్లల కంటే కొంచెం భిన్నంగా ఉంటారు. కాబట్టి వారితో వ్యవహరించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. 2008లో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంది. నాటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.