నిత్యానంద చనిపోలేదు: కైలాస దేశం

75చూసినవారు
నిత్యానంద చనిపోలేదు: కైలాస దేశం
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త స్వామి నిత్యానంద చనిపోయినట్లు నిన్న సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆయన తన ప్రాణాలు త్యాగం చేశాడని నిత్యానంద అల్లుడు సుందరేశ్వర్ తమిళ మీడియాకు చెప్పినట్లు సమాచారం. దీనిపై కైలాస దేశం స్పందించింది. స్వామి నిత్యానంద చనిపోలేదని ప్రకటించింది. ఆయన సురక్షితంగా, ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నారని వెల్లడించింది. తప్పులు ప్రచారాలు చేయవద్దని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్