ఆటిజమ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 42 మంది పిల్లల్లో ఒకరు దీని బారినపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మనదేశంలో ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరు దీని బారినపడుతున్నారు. అమ్మాయిల కన్నా అబ్బాయిల్లో ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒకప్పుడు మాటలు రావటం వంటివి ఆలస్యమైతే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు కాస్త అవగాహన పెరగటం వల్ల త్వరగా డాక్టర్లను సంప్రదించి, చికిత్స తీసుకోవటానికి వస్తున్నారు.