పర్యావరణవాదులు కంచా గచ్చిబౌలి భూముల వేలం వల్ల హైదరాబాద్‌లో కాలుష్యం, వేడి పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతం నగరానికి "గ్రీన్ లంగ్స్"లా ఉంటుందని, కాంక్రీట్ జంగిల్‌గా మారితే జీవవైవిధ్యం నశిస్తుందని అంటున్నారు. 2008-09 HCU, WWF-ఇండియా అధ్యయనంలో 455 జీవులు, వందల చెట్లు ఉన్నట్లు తేలింది. ఇది క్లైమేట్ రెగ్యులేటర్, కార్బన్ సింక్‌గా పనిచేస్తుందని చెప్పారు.