శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనస్సుకు కూడా అంతే అవసరమని బ్రహ్మ కుమారి రమాదేవి పేర్కొన్నారు. కార్తీక మాసం పర్వదినం పురస్కరించుకుని మంగళవారం కాకినాడ రాజాజీ వీధిలో ఉన్న బ్రహ్మకుమారి భవనంలో మీడియా మిత్రులతో ఆధ్యాత్మిక, ఆత్మీయ సమావేశంను ఆమె నిర్వహించారు ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ భారత దేశం ఒక ఆధ్యాత్మిక శక్తని కొనియాడారు. నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాలలో సుఖశాంతులు కలుగుతాయన్నారు.