ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఒడిస్సా వెళ్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సును వెనకవైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.