రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' కలెక్షన్లలో దుమ్మురేపింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ కొట్టింది. రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ మూవీ ఇప్పుడు టీవీ ఛానెల్లో తొలిసారి ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ప్రోమోను ఆ ఛానల్ విడుదల చేసింది. మరి ఈ మూవీ ఎంత టీఆర్పీ సాధిస్తుందో వేచి చూడాలి.