ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు

21405చూసినవారు
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం అభ్యర్థికి కల్పించాలని కలెక్టర్లకు ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడే ఏజెంట్‌కు అవకాశం కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫామ్-17సీ, పెన్ను, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సెంటర్‌లో సెల్‌ఫోన్ కలిగిన మీడియా ప్రతినిధులను అనుమతించవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్