వైసీపీ రాష్ట్ర కార్యదర్శులుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, అనకాపల్లి జిల్లాకు చెందిన బొడ్డేడ ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికైన వారికి పలువురు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.