అసెంబ్లీ సమావేశాల్లో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడారు. శుక్రవారం ఉదయం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్ దారులకు పని దినాల శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ విధానంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఉపాధి హామీ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరారు.