అమలాపురం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ పై దాడి

65చూసినవారు
అమలాపురం డిపో డ్రైవర్ కే. శ్రీనివాస్ రాజుపై భీమవరం సమీపంలో గల కాళ్ల గ్రామం వద్ద బైక్పై వెళ్తున్న తమకు సైడ్ ఇవ్వలేదని నలుగురు సోమవారం భౌతిక దాడికి పాల్పడ్డారు. అమలాపురం ఆర్టీసీ డిపోలోని కార్మికులు దాడికి నిరసనగా మంగళవారం ధర్నా చేపట్టారు. ప్రజాసేవ చేస్తున్న కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్